మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పట్టణానికి చెందిన ఇద్దరు ప్రధాన బెట్టింగ్ నిర్వాహకులు సచిన్ ఉత్తర్‌వార్, మనోజ్ మన్‌దానీని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈనెల 1వ తేదీన సచిన్‌ను అదుపులోకి తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చిన పోలీసులు.. రెండు రోజుల క్రితం మనోజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సచిన్ అరెస్టు తరువాత ధర్మాబాద్‌లో బెట్టింగ్ దందా చేస్తున్న వారంతా పరారైనట్లు తెలిసింది.
ఈ నెల 6వ తేదీన మళ్లీ ధర్మాబాద్‌కు వెళ్లిన ఇక్కడి పోలీసులు మనోజ్‌ను అరెస్టు చేసేందుకు తీవ్రంగా శ్రమించారని, సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు సమయం పట్టిందని తెలిసింది. చివరకు గేటు, ఇంటి తాళలు పగులగొట్టి అదుపులోకి తీసుకున్నారని సమాచారం.


