సుభాష్‌నగర్: నగరంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో పీహెచ్‌సీ, ఉప కేంద్రాల్లో పని చేస్తున్న ఏఎన్‌ఎంలకు హెచ్‌ఎంఐఎస్‌పై డీఎంహెచ్‌వో రాజశ్రీ గురువారం శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణుల పేర్ల నమోదు, ప్రసవాలు, వ్యాధి నిరోధక టీకాలు, మాతా శిశు మరణాలు, జీవన శైలి వ్యాధులపై చేస్తున్న నిర్ధారణ పరీక్షలు, తదితర సేవలను హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో ఏఎన్‌ఎంలు వెంట వెంటనే నమోదు చేయాలన్నారు. సమయపాలన పాటించాలని, ఉపకేంద్రాల వారీగా కేటాయించిన లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలని సూచించారు. మిగతా అంశాలపై డీడీఎం నారాయణ, హెచ్‌ఈవో శ్రీనివాస్ శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో ఆర్మూ ర్ డివిజన్ పీహెచ్‌సీ ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
సుభాష్‌నగర్: నగరంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోగల 11 కేవీ ఫీడర్లలో 33 కేవీ టవర్ ఎరెక్షన్ పనులు నిర్వహించడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–2 ఏడీఈ ఆర్ ప్రసాద్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 11కేవీ గోశాల ఫీడర్ పరిధిలో శుక్రవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కాంగ్రెస్ భవన్, కవితా కాంప్లెక్స్, గంజ్, రాంగోపాల్ స్ట్రీట్, దేవి రోడ్, మిర్చి కంపౌండ్, తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నామన్నారు. 11కేవీ రైల్వే ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
డీ–4 సెక్షన్ పరిధిలో..
నగరంలోని 11 కేవీ ఫులాంగ్–1 లైన్ కింద చెట్ల కొమ్మలు నరికివేత కారణంగా శుక్రవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు టౌన్–3 ఏడీఈ వినోద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యాస స్కూల్, రానా టవర్స్, వినాయక, ఆకాశ్ అపార్ట్‌మెంట్లు, శివాలయం ఏరియా, ఫులాంగ్, మజీద్, మదీనా మజిద్, వేణు మాల్, నిఖిల్ సాయి, వంశీ హోటల్, హైదరాబాద్ రోడ్, రైతుబజార్, కాకతీయ స్కూల్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని వినోద్ కోరారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజును ఈ నెల 15 వరకు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ సంపత్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 20వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్ www. telanganauniversity. ac. in ను సందర్శించాలని కంట్రోలర్ సూచించారు.


