పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Apr 6 2026 7:24 AM | Updated on Apr 6 2026 7:24 AM

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

కమ్మర్‌పల్లి (మోర్తాడ్‌): మోర్తాడ్‌లోని వివేకానంద విద్యాలయానికి చెందిన 2009–10 ఎస్సెస్సీ బ్యాచ్‌ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గ్రామంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఆనాటి విద్యార్థులందరూ తరలివచ్చారు. ఏళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులందరూ మళ్లీ ఒక్కచోట కలుసుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆనాటి హెచ్‌ఎం నంబుల గిరితోపాటు ఉపాధ్యాయులు లావణ్య, షైక్‌ అహ్మద్‌, సురేష్‌, సవీన్‌, స్వామి తదితరులను కార్యక్రమానికి ఆహ్వానించి సన్మానించారు.అనంతరం వారంతా సహాపంక్తి భోజనాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement