నిజామాబాద్ రూరల్: కళాకారుల అభ్యున్నతికి కృషి చేస్తానని జనం పాట కల్చరల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాంపూర్ సాయి అన్నారు. శుక్రవారం నగరంలోని కంఠేశ్వర్‌లో జనం పాట కల్చరల్ అసోసియేషన్ 2026–27 జిల్లా నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాంపూర్ సాయి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఇకనుంచి జిల్లా కళాకారుల అభ్యున్నతి కోసం పోరాడుతామన్నారు. 21 మంది కళాకారులతో కమిటీని రెండేళ్లకు గాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పస్క నర్సన్న, అధ్యక్షుడిగా రాంపూర్ సాయి, ఉపాధ్యక్షులుగా రాజేందర్ చిన్న, ప్రశాంత్ రెడ్డి, సవిత, ప్రధాన కార్యదర్శిగా నల్ల మహేందర్, కోశాధికారిగా గోరకంటి రాజు, కార్యనిర్వాహక కార్యదర్శిగా కర్క రమేశ్, సహాయ కార్యదర్శులుగా ఏ చిట్టిబాబు, డప్పు సంతోష్, సలహాదారులుగా ఆర్టీసీ మల్లన్న, కోకిల నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా నవీన్, సోనీ, డప్పు మహేశ్, గణేశ్, గోపాల్, ఆలెపు నరేశ్, స్రవంతి, పద్మ, సతీశ్ ఎన్నికయ్యారు. అనంతరం అధ్యక్షుడు రాంపూర్ సాయిని సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.


