పాపన్న గౌడ్‌ స్ఫూర్తితో ముందుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

పాపన్న గౌడ్‌ స్ఫూర్తితో ముందుకెళ్లాలి

Apr 3 2026 7:44 AM | Updated on Apr 3 2026 7:44 AM

నిజామాబాద్‌ రూరల్‌: సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. నగరంలో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్‌ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలోని వినాయక్‌ నగర్‌లోగల సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహానికి కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. పాపన్న గౌడ్‌ చేసిన పోరాటాలు అందరికీ స్ఫూర్తిదాయకామన్నారు. పాపన్నగౌడ్‌ వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు. అదనపు కలెక్టర్‌ దిలీప్‌ కుమార్‌, జిల్లా వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి సుజయ్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రతినిధి బుస్స ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement