డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీలో ముంపునకు గురైన పాత కుస్తాపురం రామలింగేశ్వర స్వామి ఆలయ శిఖరం బయటికి తేలింది. ఎండల కారణంగా ఎస్సారెస్పీలో నీటి మట్టం తగ్గుతుండడంతో శిఖరం స్వల్పంగా బయటకు కనిపిస్తోంది. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా డొంకేశ్వర్ మండలం జీజీ నడ్కుడకు చెందిన మత్స్యకారుడు చిన్న గంగారాం, మరికొందరు మత్స్యకారులు కలిసి తెప్పపై శిఖరం వద్దకు వెళ్లారు. శిఖరంపై కాషాయ జెండాను కట్టి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ ఏడాది కొంత ఆలస్యంగా అది కూడా కొద్దిగానే గుడి శిఖరం బయటకు తేలినట్లు మత్స్యకారులు చెబుతున్నారు.


