ఎండీఎం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఎండీఎం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Mar 10 2026 7:14 AM | Updated on Mar 10 2026 7:14 AM

నిజామాబాద్‌ అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మ ధ్యాహ్న భోజన(ఎండీఎం)కార్మికుల సమస్యలు ప రిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం మ ధ్యాహ్న భోజన పథకాన్ని పక్కదారి పట్టిస్తుందని సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ విధానంతో మధ్యాహ్న భోజన ప థకాన్ని దొడ్డిదారిన ప్రయివేట్‌ సంస్థకు అప్పజెప్పే కుట్రలు చేస్తున్నారన్నారు. సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ విధానాన్ని ఉపసంహరించుకోకపోతే అసెంబ్లీని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. నాయకులు చక్రపాణి, సాయమ్మ, గంగమణి, లత, బుచ్చవ్వ, లావణ్య, వీ రేశం, నాగలక్ష్మి, లలిత, అనసూయ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement