విధులు, బాధ్యతలపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విధులు, బాధ్యతలపై అవగాహన ఉండాలి

Mar 10 2026 7:14 AM | Updated on Mar 10 2026 7:14 AM

ఎంపీడీవో భీంరావు

ఉప సర్పంచులు, వార్డుమెంబర్లకు

శిక్షణ ప్రారంభం

డిచ్‌పల్లి: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికై న ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు తమ విధులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో భీంరావు అన్నారు. డిచ్‌పల్లిలోని మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం తొలి విడత శిక్షణలో భాగంగా మండలంలోని బర్ధిపూర్‌, దూస్‌గాం, మెంట్రాజ్‌పల్లి, బీబీపూర్‌ తండా, దేవనగర్‌ క్యాంప్‌, గొల్లపల్లి, కమలాపూర్‌, కొరట్‌పల్లి, ఆరేపల్లి, నర్సింగ్‌పూర్‌ (కొత్తపేట్‌), డిచ్‌పల్లి, బీబీపూర్‌ గ్రామాలకు చెందిన 102 మంది ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులను ఎంపీడీవో ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శిక్షణ తరగతులు ఐదు రోజులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వారికి 2018 పంచాయతీరాజ్‌ చట్టంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆయా పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రామ సభలు, సమావేశాల్లో తప్పకుండా ప్రతినిధులందరూ హాజరు కావాలని, వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాకుండా ఉన్న వార్డు మెంబర్లను పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం చివరి రోజు పరీక్ష నిర్వహించి మార్కులు కేటాయిస్తామని, ధ్రువపత్రం అందజేస్తామని అన్నారు. ఎంపీవో శ్రీనివాస్‌గౌడ్‌, టీవోటీలు సాయికుమార్‌, విష్ణువర్థన్‌, సుమన్‌, సింగోత్తం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement