నిజామాబాద్ రూరల్: వక్ఫ్ భూముల రక్షణ, ఉర్దూ భాషా వికాసానికి ప్రభు త్వం పెద్దపీట వేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌ డ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని ఖిల్లా రోడ్‌లో సో మవారం సాయంత్రం ప్రభుత్వం తరఫున అధికారిక ఇఫ్తార్ విందు నిర్వహించారు. కార్యక్రమానికి మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ హాజరై, ముస్లింలకు ‘రంజాన్ తోఫా’ను పంపిణీ చేశారు. మహేష్ కుమార్‌గౌడ్, షబ్బీర్ అలీ మా ట్లాడుతూ.. ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, మేయర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.


