● జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవం
● పలు సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో
మహిళా అధికారులు, సిబ్బందికి సన్మానం
సాక్షి నెట్‌వర్క్: మహిళలు అభివృద్ధి చెందితే ఆ ఇంటితోపాటు ఆ గ్రామం, ఆ దేశం అభివృద్ధి చెందుతుందని వక్తలు కొనియాడారు. జిల్లాకేంద్రంలో సో మవారం వివిధ సంఘాలు, అసోషియేషన్లు, స్వ చ్ఛంద సంస్థలు, క్లబ్‌ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నగరంలోని జిల్లాకోర్టు సముదాయంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కా ర్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారత లక్ష్మీ హాజరై, మాట్లాడారు. దేశ ప్రగతి నిర్మాణంలో మహిళలు ముందు వరుస లో ఉన్నారన్నారు. మొదటి అదనపు జిల్లా జ డ్జి హ రీష, నాల్గవ అదనపు జిల్లాజడ్జి దుర్గా ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్భూ ఉపాధ్యాయ, కీర్తి రాజ్, బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణి క్ రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించా రు. పరిషత్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కంఠేశ్వర్ ఉమెన్స్ కాలేజీలో డైరెక్టర్ వనిత సన్మానించారు. మేయర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్స్ భవన్‌లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేయర్ ఉమారాణిని సన్మానించారు. సెయింట్ జేవియర్స్ హైస్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయురాళ్లను, ఆయమ్మలను సన్మానించారు. మున్నూరుకాపు కల్యాణ మండపంలో జీఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయురాళ్లను మాజీ జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు, సొసైటీ సభ్యులు సన్మానించారు.


