వేం నరేందర్‌రెడ్డిని కలిసిన సంజయ్‌ | - | Sakshi
Sakshi News home page

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన సంజయ్‌

Mar 10 2026 7:14 AM | Updated on Mar 10 2026 7:14 AM

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన సంజయ్‌ సేవాలాల్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు హెచ్‌పీవీ టీకాల పంపిణీ ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ పర్యావరణాన్ని కాపాడాలి

సుభాష్‌నగర్‌: కాంగ్రె స్‌ పార్టీ రాజ్యసభ అ భ్యర్థి వేం నరేందర్‌రె డ్డిని సోమవారం హై దరాబాద్‌లోని తన ని వాసంలో మాజీ మే యర్‌ ధర్మపురి సంజయ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవం కానున్న సందర్భంగా వేం నరేందర్‌రెడ్డిని శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

నిజామాబాద్‌ రూరల్‌ : నగరంలోని కంఠేశ్వర్‌ ప్రాంతంలో ఉన్న ఇందూరు పీఠం శ్రీ భగవద్రామ్‌–సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయంలో సో మవారం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్పీ మహే ష్‌ కుమార్‌ గౌడ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించా రు. మేయర్‌ ఉమారాణి, రమేష్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, నుడా చైర్మన్‌ కేశవేణు, నగర కాంగ్రెస్‌ అ ధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు.

ధర్పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాలికలకు హెచ్‌పీవీ టీకాలను వేస్తున్నట్లు మెడికల్‌ ఆఫీసర్‌ సుశాంత్‌ రెడ్డి తెలిపా రు. ఇందులో భాగంగా సోమవారం ఐదుగురు బాలికలకు టీకాలను ఇచ్చామన్నారు. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌ నిరోధానికి ప్రభు త్వం హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ టీకాలను 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలను ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

మోపాల్‌: మండలంలోని ముదక్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సర్పంచ్‌ మంగలి నరేష్‌, ఎంపీడీవో రాములు నాయక్‌తో కలిసి నిజా మాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి భూ మిపూజ చేశారు. ఈసందర్భంగా ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోనే అన్నివర్గా ల ప్రజలకు న్యాయం దక్కుతుందన్నారు. రా బోయే పదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందని, బీఆర్‌ఎస్‌కు నూకలు చెల్లినట్లేనని, బీజేపీ కి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి, విజన్‌ లేదని ఆ రోపించారు. ఉపసర్పంచ్‌ రంజిత్‌, పంచాయతీ కార్యదర్శి, కార్యకర్తలు పాల్గొన్నారు.

ధర్పల్లి: పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీడీవో లక్ష్మారెడ్డి అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ధర్పల్లిలో సోమవారం ఎంపీడీవో లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేస్ట్‌ కలెక్షన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. దీనిలో భాగంగా గ్రామంలో ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను గ్రామపంచాయతీ సిబ్బంది సేకరించారు. ఈసందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్‌ వస్తువులను గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇచ్చి సహకరించాలని ప్రజలను కోరారు. సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ శ్రీకాంత్‌, సెక్రెటరీ శ్రీనివాస్‌ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement