ఎత్తులకు పై ఎత్తులు
న్యూస్‌రీల్
నిజామాబాద్
సేంద్రియ పసుపు రైతులకు..
సేంద్రియ పద్ధతిలో పసుపు సాగు చేసే రైతు లకు రూ.16వేల ప్రోత్సాహకం అందజేసే ఆ లోచన చేస్తున్నట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు.
గురువారం శ్రీ 5 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
– 8లో u
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సమయం లేదు మిత్రమా.. ప్రతి నిమిషాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి.. అంటూ పురపోరులో బరిలో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. ఆయా పార్టీలు సైతం నిజామాబాద్ మేయర్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ చైర్మన్‌ల పీఠాలు దక్కించుకునేందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తూ వ్యూహాలు రచిస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం మొదలైంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసు కుంటున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన మేయర్ అభ్యర్థులు శమంత, స్రవంతిలు తాము పోటీలో ఉన్న డివిజన్‌లలో గెలుపొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిజామాబాద్‌లోని 60 డివిజన్లలో 20 చోట్ల ఎంఐఎం ప్రభావం చూపుతోంది. మిగిలిన స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అనే స్థాయిలో పోటాపోటీగా ఉన్నాయి. అయితే బీఆర్‌ఎస్ అభ్యర్థులు సైతం పలు డివిజన్లలో తీవ్రమైన పోటీ ఇస్తున్నారు. అత్యధిక డివిజన్లలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు చూపించే ప్ర భావం కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలున్నట్లు అంచనా.
బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండగా.. 20 వార్డుల్లో ఎంఐఎం ప్రాబల్యం ఉంది. గత ఎన్నికల్లో 11 చోట్ల గెలిచిన ఎంఐఎం ఈసారి 20 వార్డుల్లో గెలిచే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ను ఎదుర్కొని చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఎంఐఎం వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ మద్దతు సైతం తీసుకుని పీఠం దక్కించుకునేందుకు ఎంఐఎం ప్రణాళికలు రచిస్తోంది. దీంతో ఇక్కడ వచ్చే ఫలితంపై ఆసక్తి పెరిగింది.
ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏబీ చిన్నా భార్య శ్రీదేవి చైర్‌పర్సన్ రేసులో ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆ పార్టీ అంతగా పోటీ ఇవ్వడం లేదు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇక్కడి నుంచే ఉన్నప్పటికీ ఆ పార్టీ సైతం ప్రభావం చూపలేకపోతోంది. దీంతో కాంగ్రెస్‌కు కలిసొచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
భీమ్‌గల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చైర్మన్ పీఠమే లక్ష్యంగా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సైతం ప్రశాంత్‌రెడ్డి కృషితో మోర్తాడ్, కమ్మర్‌పల్లి, బాల్కొండ, వేల్పూర్, ఏర్గట్ల, బడాభీమ్‌గల్ తదితర మేజర్ పంచాయతీల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇదే ఒరవడితో భీమ్‌గల్ మున్సిపాలిటీలో సైతం పాగా వేసేందుకు ప్రశాంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారు.
పురపోరులో ఆయా పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. మున్సిపల్ పీఠాలపై జెండా ఎగరేసేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వ్యూహాలు రచిస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం మొదలైంది. బీఆర్‌ఎస్ అభ్యర్థులు సైతం పలు డివిజన్లలో తీవ్రమైన పోటీ ఇస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కార్పొరేషన్‌తోపాటు మూడు మున్సిపాలిటీల్లో రాజకీయ సమీకరణాలు రకరకాలుగా మారుతున్నాయి.
సమయం సద్వినియోగానికి
అభ్యర్థుల ఉరుకులు పరుగులు
కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం
ఆరోపణలు, ప్రత్యారోపణలు
ప్రత్యర్థులకు టెన్షన్ పెంచుతున్న బీఆర్‌ఎస్
ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో తీరుగా మారుతున్న సమీకరణాలు
ఎత్తులకు పై ఎత్తులు


