మొదటి మహిళా కౌన్సిలర్‌ గొల్ల నాగమ్మ | - | Sakshi
Sakshi News home page

మొదటి మహిళా కౌన్సిలర్‌ గొల్ల నాగమ్మ

Feb 5 2026 7:14 AM | Updated on Feb 5 2026 7:14 AM

మొదటి

మొదటి మహిళా కౌన్సిలర్‌ గొల్ల నాగమ్మ

రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన సునీతాదేశాయ్‌

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ మున్సి పల్‌ కౌన్సిల్‌లో మొదటి మహిళా కౌ న్సిలర్‌గా మాదాసు గొల్ల నాగమ్మ పని చేశారు. 1981లో ఆమె 16వ వార్డు (ఎల్లమ్మగుట్ట) నుంచి 400 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 8 మంది ఎన్నికల బరిలో నిలవగా నాగమ్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. నాగమ్మ కౌన్సిలర్‌గా ఎన్నిక కాక ముందే కాలనీల్లో మహిళలకు ఉపాధి కోసం బీడీ కార్ఖానాలు ఏర్పాటు చేయించారు. ప్రజా సమస్యలపై స్పందించే వ్యక్తిత్వం, పరిష్కార మా ర్గాలు చూపడం ఆమె విజయానికి కా రణమయ్యాయి. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత తన తమ్ముడు గొల్ల నర్సయ్య హోటల్‌లో కేవలం చాయ్‌ తాగించారు. ఆమె వారసత్వాన్ని నాగ మ్మ మేనల్లుడు మాదాసు స్వామి యాదవ్‌ పుణికి పుచ్చుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. పేదలు, నిరక్షరాస్యులకు సేవలందిస్తున్నారు. గతేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదర్శ మహిళలకు మాదాసు నాగమ్మ పేరుతో స్వామి యాదవ్‌ అవార్డులు ప్రదానం చేశారు. స్వామి యాదవ్‌ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.

గొల్ల నాగమ్మ (ఫైల్‌)

ఎంపీటీసీ నుంచి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా..

బోధన్‌ : ఎంపీటీసీ నుంచి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా సునీతా దేశాయ్‌ ఎదిగారు. రుద్రూర్‌ మండల కేంద్రానికి చెందిన సీనియర్‌ న్యాయవాది వీఆర్‌ దేశాయ్‌ కుటుంబం 1981 సంవత్సరానికి ముందే చదువుల నిమిత్తం బోధన్‌కు వచ్చింది. న్యాయవాద వృత్తి ప్రాక్టీస్‌ కోసం పట్టణంలోనే స్థిరపడ్డారు. వీఆర్‌ దేశాయ్‌ సతీమణి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ సునీతా దేశాయ్‌ రాజకీయరంగ ప్రవే శం చేసి అంచెలంచెలుగా ఎదిగారు. 1987లో టీడీపీలో చేరారు. 1989– 96 వరకు టీడీపీ వర్ని మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. 1997లో జరిగిన మండల పరిషత్‌ ఎన్నిక ల్లో రుద్రూర్‌–2 ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీగా ఎ న్నికయ్యారు. 2000 సంవత్సరంలో మున్సిపల్‌ చై ర్మన్‌ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సునీ తా దేశాయ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా డీసీసీబీ మాజీ చైర్మన్‌ గంగాధర్‌రావు పట్వారీ సతీమణి పద్మావతి ప ట్వారీ, ఎంఐఎం నుంచి ముంతాజ్‌ సిద్ధికీ పోటీ పడ్డారు. 1,765 ఓట్ల మెజారిటీతో సునీతా దేశాయ్‌ విజయం సాధించారు. 2000 నుంచి 2005 వరకు చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆమె హయాంలో మున్సిపల్‌ స్థలాల్లో ని వా సం ఉంటున్న పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కు అప్పట్లో 194 జీవోను ప్రభుత్వం జారీ చేసింది. సునీతా దేశాయ్‌ భర్త వీఆర్‌ దేశాయ్‌ 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌)లో చేరారు. 2022–2024 వరకు బోధన్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్య తలు నిర్వర్తించారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

1981లో 400 ఓట్ల భారీ మెజార్టీతో విజయం

మహిళల ఉపాధి కోసం బీడీ కార్ఖానాలు ఏర్పాటు చేయించిన నాయకురాలు

మొదటి మహిళా కౌన్సిలర్‌ గొల్ల నాగమ్మ1
1/1

మొదటి మహిళా కౌన్సిలర్‌ గొల్ల నాగమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement