హిందుత్వం మా ఎన్నికల ఎజెండా కాదు
సుభాష్‌నగర్: హిందుత్వం బీజేపీ ఎన్నికల ఎజెండా కాదని, శ్రీ రాముడితో బీజేపీ రాజకీయం చేయడం లేదని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. హిందూ రాష్ట్రం కోసం ఎప్పటికీ పోరాడుతూనే ఉంటామని, అది తమ డీఎన్‌ఏలోనే ఉందని పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఎన్నికల ఇన్‌చార్జి, మా జీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌తో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఎన్నికలంటే కాంగ్రెస్‌కు భయం పట్టుకుందని, అవినీతి ఆ పార్టీ ఎజెండా అని విమర్శించారు. ఎన్ని కల సమయంలోనే రాముడు గుర్తుకొస్తాడన్న కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలపై అర్వింద్ తీవ్రంగా స్పందించారు. జిల్లా కాంగ్రెస్‌లో పరిణతి చెందిన నాయకుడు ఉన్నాడా.. అంతా పరిణతి లేని నాయకులు ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ కాబట్టే తాను పార్టీలో చేరలేదని స్పష్టంచేశారు. ఎంఐఎంతో కాంగ్రెస్‌కు జీవితాంతం లోపాయికారి ఒప్పందం ఉంటుందని, బీజేపీ మి గులు సరుకుకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందని ఎద్దేవాచేశారు. బీజేపీలో ఉండి వేరే పార్టీకి పని చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన సిట్టింగులకు టికెట్లు ఇవ్వలేదన్నారు. ఓ పార్టీ నుంచి మేయర్‌గా ప్రచారంలో ఉన్న అభ్యర్థి నుంచి 17 ఏళ్ల ఆస్తిపన్ను బకాయి కట్టించిన ఘనత బీజేపీదేనని అన్నారు. బీజేపీ గెలిస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని, ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం, నగర అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తామని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ అంటేనే అవినీతి అని, మే యర్ సీ టు కోసం కోట్లు ఖర్చు చేసి.. ఆ తర్వాత కార్పొరేషన్‌ను లూటీ చేసేందుకు సిద్ధమైందని ఆరోపించారు. సుమారు రూ.100 కోట్ల ఆస్తిపన్ను బకాయిలు ముక్కు పిండి వసూలు చేసి, నగర అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, నాయకులు గద్దె భూమన్న, శ్రీధర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అవినీతి కాంగ్రెస్ ఎజెండా
ఇందూరును అప్పగిస్తే లూటీ చేస్తారు
వసూళ్లకు పాల్పడిన సిట్టింగ్‌లకు
టికెట్లు ఇవ్వలేదు
ఎంపీ అర్వింద్ ధర్మపురి


