పట్టణానికి పోదాం చలో చలో..
మోర్తాడ్(బాల్కొండ): మున్సిపల్ ఎన్నికల వా తావరణం వేడెక్కడంతో పల్లెలకు చెందిన నాయకులు ‘పట్టణానికి పోదాం చలో చలో’ అంటున్నారు. నిజామాబాద్ నగరంతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ పట్టణాల్లో మున్సిపల్ ఎన్నిక ల నేపథ్యంలో అభ్యర్థులకు అండగా ఉంటూ వా రి విజయానికి కృషి చేసేలా గ్రామీణ ప్రాంత నాయకులకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు బా ధ్యతలను అప్పగించాయి. భీమ్‌గల్ మున్సిపాలిటీలో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో అ భ్యర్థుల వెంట ఉన్నారు. ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో ఆయా నియోజకవర్గాల్లోని గ్రామీణ నా యకులు అభ్యర్థుల వెన్నంటి ఉంటున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో నగరానికి చెందిన వారితోపాటు రూరల్ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొంటున్నారు. పట్టణాలకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలకు అక్కడి స్థానిక నాయకులు ప్రచారంపై దిశానిర్దేశం చేస్తున్నారు.
పల్లె నాయకులకు మున్సిపల్
ఎన్నికల బాధ్యతలు
తమ అభ్యర్థులకు అండగా ఉండాలని రాజకీయ పార్టీల ఆదేశం
మూడు ప్రధాన పార్టీలదీ అదే ప్లాన్


