గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తిచేస్తాం | - | Sakshi
Sakshi News home page

గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తిచేస్తాం

Feb 1 2026 3:04 AM | Updated on Feb 1 2026 3:04 AM

గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తిచేస్తాం

గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తిచేస్తాం

సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు

సమర్థ్ధవంతంగా పనిచేసేలా చర్యలు

వీసీలో అదనపు కలెక్టర్‌ అంకిత్‌

నిజామాబాద్‌అర్బన్‌: ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని అదనపు కలెక్టర్‌ అంకిత్‌ పే ర్కొన్నారు. తప్పిదాలకు తావు లేకుండా పూర్తి చే సేందుకు సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా పనిచేసేలా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారుల తో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) సన్నాహక ప్రక్రియ పురోగతిపై సమీక్ష ని ర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడు తూ ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఓటర్‌ మ్యాపింగ్‌లో ఎ లాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా ఈఆర్‌వోలు సమగ్ర పర్యవేక్షణ చేపట్టి, సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీసీలో పాల్గొన్న అదనపు కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ పొరపాట్లకు తావు లేకుండా నిర్ణీత గడువులో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. వీసీ లో అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) కిరణ్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియా, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement