నిజామాబాద్
న్యూస్‌రీల్
మేయర్ అభ్యర్థుల
అన్నా జర నా ముఖం సూడే..
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో వార్డుల్లో ప్రత్యర్థులుగా నిలుస్తున్న వారి జాబితా బహిర్గతమైంది.
శనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026
– 8లో u
19వ డివిజన్ నుంచి కాంరగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన శమంత రెడ్డి , నల్ల స్రవంతి రెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం పూర్తయినప్పటికీ బీ–ఫారాల విషయంలో అన్ని పార్టీలు ఒకే వైఖరి అవలంబిస్తున్నాయి. దీంతో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో, ఆయా పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ ల నుంచి ప్రతి డివిజన్ నుంచి ఆశావహుల సంఖ్య భారీగా ఉండడంతో ఆయా పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. మరోవైపు ఆశావహులు వివిధ సెట్ల నామినేషన్లు దాఖలు చేసారు.
ఈ రెండు పార్టీల పేరుతో నామినేషన్లు వేసినవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఉపసంహరణ నాటికి ఏ పార్టీ బీఫారం వచ్చినా మేలే అనే లెక్కలతో ఆయా అభ్యర్థులు నామినేషన్లు వేసారు. ఈనేపథ్యంలో ముఖ్యంగా నిజామాబాద్ నగరపాలకంలో రాజకీయంగా ప్రత్యేక వాతావరణం నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు మేయర్ పీఠం కోసం ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. ఎంఐఎం సైతం తన గట్టి ప్రాబల్యం కలిగి ఉంది. దీంతో మేయర్ పదవి విషయంలో అనేక రకాలుగా సమీకరణలు మారే అవకాశాలు ఉన్నాయి.
● బీజేపీ నుంచి మేయర్ అభ్యర్థిగా ప్రకటించబడిన గోపిడి స్రవంతి రెడ్డి 6వ డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అర్వింద్, ఎమ్యెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు.
● కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడలేదు. మేయర్ పీఠమే లక్ష్యంగా 19వ డివిజన్ నుంచి నల్ల స్రవంతి రెడ్డి, కాటిపల్లి శమంత రెడ్డి నామినేషన్లు దాఖలు చేసారు. వీరిద్దరిలో ఎవరికి బీఫారం వస్తే వారే కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కాను న్నారు. మేయర్ పదవి ఆశిస్తున్న ఇద్దరూ ఒకే డివిజన్ నుంచి నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. అయితే ఉత్కంఠ వీడాలంటే నామినేషన్ల ఉపసంహరణ రోజు వరకు వేచి చూడాల్సిందే.
బీజేపీ మేయర్ అభ్యర్థి గోపిడి స్రవంతి
కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై వీడని ఉత్కంఠ
19వ డివిజన్ నుంచి నామినేషన్లు వేసిన నల్ల స్రవంతి, కాటిపల్లి శమంత
ఎవరికి బీఫారం వస్తే వారే
కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి
నిజామాబాద్


