నామినేషన్ కేంద్రాల పరిశీలన
నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్ సత్యనారాయణ రెడ్డి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని 13, 14, 15 డివిజన్ల నామినేషన్ల స్వీకరణ కేంద్రంతోపాటు అర్సపల్లి వాటర్ ట్యాంక్ జోన్ ఆఫీసు, బోధన్, ఆర్మూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, భీమ్‌గల్ మండల పరిషత్ కార్యాలయాలను సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నామినేషన్ల స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్ల సన్నద్ధతపై అధికారులతో చర్చించారు. అబ్జర్వర్ వెంట బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు.
అవినీతి రహిత
నాయకత్వం కావాలి
● కార్పొరేషన్‌పై బీజేపీ జెండా
ఎగురవేస్తాం..
● ఎంపీ అర్వింద్ ధర్మపురి
సుభాష్‌నగర్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అవినీతి రహిత నాయకత్వం అవసరమని, అది బీజేపీతోనే సాధ్యమని ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని 6వ డివిజన్ అభ్యర్థి గోపి డి స్రవంతిరెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ నిజామాబాద్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్య క్తం చేశారు. మున్సిపాలిటీలో యూజీడీ ప నులు పూర్తి కావాలన్నా.. ప్రజలకు రోడ్లు, ప రిసరాల పరిశుభ్రత, వీధి లైట్ల వంటి కనీస సౌకర్యాలు కల్పించాలంటే బీజేపీ అభ్యర్థుల ను గెలిపించాలని కోరారు. అవినీతి రహిత కార్పొరేషన్‌గా తీర్చిదిద్దే బాధ్యత బీజేపీ, తాను తీసుకుంటానని తెలిపారు. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, టికెట్ దక్కని వారు నిరుత్సాహపడొద్దని విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే, కోర్ కమిటీ ప్రతినిధి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అభ్యర్థులు పాల్గొన్నారు.
నామినేషన్ల కేంద్రం వద్ద ఉద్రిక్తత
● మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని
అడ్డుకున్న ఎస్‌హెచ్‌వో
ఆర్మూర్: నామినేషన్లు వేయడానికి వచ్చిన తమ పార్టీ వారిపై కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి శుక్రవారం ఆర్మూర్‌లో ని నామినేషన్ కేంద్రానికి తరలివచ్చాడు. అనుచరులను వెంట బెట్టుకొని కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఆయనను ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ పోలీసు బల గాలతో అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట ర్ ఇలా త్రిపాఠికి ఫోన్ చేసి పోలీసుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఘటనలు జరగడం లేదంటూ ఎస్‌హెచ్‌వో చెప్పడంతో జీవన్‌రెడ్డి వెనుదిరిగారు.
నామినేషన్ కేంద్రాల పరిశీలన


