విద్యార్థినులతో సెల్ఫీ
బోధన్‌టౌన్(బోధన్): జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బోధన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులను ఆప్యాయంగా పలకరించి వారితో కాసేపు ఆనందంగా గడిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించడానికి వచ్చిన కలెక్టర్‌ను విద్యార్థినులు కలిశారు. కలెక్టర్ విద్యార్థినులకు కరచాలనం చేశారు. చాకెట్లు పంచారు. చక్కగా చదువుకోవాలని సూచించారు. విద్యార్థినులతో కలిసి సెల్ఫీ దిగారు.


