నేటి నుంచి వందేమాతరంపై తెయూలో ఛాయాచిత్ర ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వందేమాతరంపై తెయూలో ఛాయాచిత్ర ప్రదర్శన

Jan 29 2026 6:07 AM | Updated on Jan 29 2026 6:07 AM

నేటి

నేటి నుంచి వందేమాతరంపై తెయూలో ఛాయాచిత్ర ప్రదర్శన

నేటి నుంచి వందేమాతరంపై తెయూలో ఛాయాచిత్ర ప్రదర్శన

సిరికొండ: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈనెల 29 నుంచి 31 వరకు వందేమాతరంపై ఛాయా చిత్ర ప్రదర్శన నిర్వహించనున్నట్లు సీబీసీ సహయ సంచాలకులు కోటేశ్వర్‌రావు బుధవారం తెలిపారు. వందేమాతరం జాతీయ గీతానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఛాయా చిత్ర ప్రదర్శనతో పాటు అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అలాగే తెయూ కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

వాహనాల తనిఖీ

బోధన్‌: మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన నిఘా బృందాలు విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్టణ శివారులోని మర్రిమైసమ్మ ఆలయం సమీపంలో మహారాష్ట్ర వైపునుంచి వస్తున్న వాహనాలను ఎస్‌ఎస్‌టీ ( స్టాటిక్స్‌ సర్వేలైన్స్‌ టీం) బృందం సభ్యులు తనిఖీలు చేశారు. అక్రమంగా నగదు, లిక్కర్‌, నిషేధిత మత్తుపదార్థాల నియంత్రణలో భాగంగా తనిఖీలు నిర్వహించినట్టు నిఘా బృందం అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు తనిఖీలు కొనసాగుతాయని వారు వెల్లడించారు. ఎస్‌ఎస్‌టీ అధి కారి మధు, కానిస్టేబుల్‌ జగదీశ్‌ ఉన్నారు.

నేటి నుంచి వందేమాతరంపై తెయూలో ఛాయాచిత్ర ప్రదర్శన 
1
1/1

నేటి నుంచి వందేమాతరంపై తెయూలో ఛాయాచిత్ర ప్రదర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement