జ్వరంతో నాలుగేళ్ల చిన్నారి మృతి
మోపాల్: మండలంలోని అమ్రాబాద్ గ్రామపంచాయతీకి చెందిన దేగావత్ రియాన్షీ (4) అనే చిన్నారి జ్వరంతో మంగళవారం రాత్రి మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా... అమ్రాబాద్ జీపీకి చెందిన దేగావత్ సుమలత, శ్రీనివాస్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రియాన్షీ మండలంలోని మంచిప్పలోగల ఓ ప్ర యివేటు పాఠశాలలో నర్సరీ చదువుతోంది. నా లుగు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా, నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతిచెందింది. మెదపువా పు వ్యాధి లక్షణాలు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది. రియాన్షీ అంత్యక్రియలు బుధవారం గ్రామంలో ముగిశాయి.


