ప్రశాంతంగా బీఎడ్ పరీక్షలు
సిరికొండ: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బీఎడ్, బీపీఎడ్ (ఒకటవ, మూడవ) పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు 1582 మంది విద్యార్థులకు 1539 మంది విద్యార్థులు హాజరు కాగా, 43 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు.
సిరికొండ: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఎడ్ మూడవ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల తేదీలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి సంపత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి దశ ఈ నెల 31 నుంచి వచ్చేనెల 4 వరకు, రెండవ దశ వచ్చే నెల 5 నుంచి 9 వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు తెయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.
జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థిని గంగోత్రి జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు మహారాష్ట్రలో జరగనున్న 69వ స్కూల్‌గేమ్స్ జాతీయస్థాయి అండర్ 19 పోటీల్లో ఆమె పాల్గొననున్నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ బుధవారం తెలిపారు. ఈసందర్భంగా క్రీడాకారిణిని హెచ్‌ఎం, ఎంఈవో శ్రీనివాస్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ రాజ్‌కుమార్, వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు.
ఖలీల్‌వాడి: హైస్కూల్ పాఠ్యపుస్తకాల్లో డ్రగ్స్(మత్తుపదార్థాలు)తో కలిగే దుష్ప్రభావాలను పాఠ్యాంశంగా పెట్టాలని భారత సైకాలజీ సొసైటీ నిర్ణయించినట్లు నిజామాబాద్ ఐఎంఏ అధ్యక్షుడు, జాతీయ సైకియాట్రిస్ సొసైటీ డైరెక్టర్ విశాల్ బుధవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హైస్కూల్ స్థాయిలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మత్తు పదార్థాల వినియోగం, దాని దుష్ప్రభావాలపై శాసీ్త్రయంగా రూపొందించిన అధ్యాయాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని ఇటీవల ఢీల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. పాఠ్యాంశాల్లో మత్తు పదార్థాల ప్రభావాలు, మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావాలు, స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కొనే విధానాలు, నిరాకరణ నైపుణ్యాలు, సహాయం పొందే మార్గాలు, వంటి అంశాలు ఉండాలన్నారు.
బాన్సువాడ : హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎౖక్సైజ్ కానిస్టే బుల్ సౌమ్యను బుధవారం ప్ర భుత్వ వ్యవసా య సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని సౌమ్య కుటుంబ సభ్యులకుతెలిపా రు.నిమ్స్ డైరెక్టర్ బీరప్ప,నిజామాబాద్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఉన్నారు.
ప్రశాంతంగా బీఎడ్ పరీక్షలు


