క్రైం కార్నర్
బీబీపేట: బైక్ అదుపు తప్పడంతో రోడ్డు పక్కనే ఉన్నటువంటి బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన మాందాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ తెలిపిన వివరాలు ఇలా.. దోమకొండ మండల కేంద్రానికి చెందిన గోసానిపల్లి మహేష్ (27) తన అమ్మమ్మ వాళ్ల గ్రామం అయిన మాందాపూర్ గ్రామానికి వెళ్లాడు. తిరిగి శుక్రవారం రాత్రి దోమకొండకు బైక్‌పై బయలుదేరాడు. మాందాపూర్ గ్రామ శివారులో అతడి బైక్ అదుపు తప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడ్డాడు. రాత్రి సమయం కావడంతో ఎవరు గమనించకపోవడంతో రాత్రంతా బావిలోనే ఉండిపోయాడు. ఉదయం అటు పక్కన వెళ్లిన రైతులు అతడిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మహేష్‌ను బయటకు తీసి చూడగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు అయినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా.. మండలంలోని ఎండ్రియాల్ గ్రామానికి చెందిన కరుణాకర్‌రావు అనే వ్యక్తి కామారెడ్డిలో తమ పనులను ముగించుకొని శనివారం బైక్‌పై ఎండ్రియాల్ గ్రామానికి బయలుదేరాడు. కృష్ణాజీవాడి శివారులో బైక్ అదుపుతప్పడంతో అతడు కింద పడిపోయాడు. ఈ ఘటనలో కరణాకర్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానికులు కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.
భవనం పైనుంచి పడి ఒకరికి..
డొంకేశ్వర్(ఆర్మూర్): మండలకేంద్రంలో భవనం పైనుంచి పడి ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాలు ఇలా.. డొంకేశ్వర్ గ్రామానికి చెందిన కొమిరే శేఖర్ కూలి పని చేస్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం అతడు పనిలో భాగంగా ఓ భవనం పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు భవనం పైనుంచి జారిపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్


