ఓటెత్తిన గ్రామాలు
● మొదటి విడతలో కాంగ్రెస్ ఖాతాలోకి సింహభాగం సర్పంచ్ స్థానాలు
ఎడపల్లిలోని ప్రాథమిక పాఠశాల పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న మహిళలు
ఎడపల్లిలో ఓటువేసిన యువతి
బోధన్: తొలి విడత గ్రామపంచాయతీ పోరులో ఓటు వే సేందుకు మహిళలు పో టెత్తారు. తమలోని చైతన్యాన్ని చాటిచెప్పారు. ఎన్నికల జరిగిన గ్రామా ల పరిధిలో మొత్తం 2,42,723 ఓట్లకు గాను మ హిళా ఓటర్లు 1,27,757 మంది, పురుష ఓటర్లు 1,14,959 ఉన్నారు. అయితే మహిళా ఓటర్లు 1,05,282 (82.40శాతం), పురుష ఓటర్లు 92,210 (80.21శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని బోధన్ డివిజన్ ప రిధిలో గల మండలాలతోపాటు నవీపేట మండలంలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొత్తం 184 జీపీలకు గాను 29 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 155 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే మొత్తం 1642 వార్డులకుగాను 575 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 7 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 1060 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్, కౌంటింగ్‌కు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏ ర్పాట్లు చేయగా, ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సాగింది. మేజర్ జీపీల్లో ఓటర్లు బారులు తీరారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా, ముందస్తుగా గుర్తించిన 71 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఉద్యోగ, ఉపాధి కోసం దూర ప్రాంతాల్లో ఉన్న యువకులు స్వగ్రామానికి వచ్చి ఓటు వేశారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికా ర యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సాలూర మండలంలో 86.45 శాతం, బోధ న్ మండలంలో 84.93 పో లింగ్ శాతం నమోదుకాగా, నవీపేటలో తక్కువగా 76.95 శాతం నమోదైంది.
పర్యవేక్షణ.. పరిశీలన
ఆయా గ్రామాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించడంతోపాటు బందోబస్తును ఉన్నతాధికారులు పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. బోధన్ మండలం పెగడాపల్లి, నవీపేటలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. రెంజల్ మండలం కందకుర్తి, బోధన్ మండలం భవానీపేట పోలింగ్ కేంద్రాలతోపాటు ఎడపల్లి, నవీపేట మండల కేంద్రాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును సీపీ సాయిచైతన్య పర్యవేక్షించారు. రుద్రూర్, కోటగిరి, పోతంగల్, వర్ని, నవీపేట మండలాల్లో అడిషనల్ కలెక్టర్ అంకిత్ పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్‌లాల్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో వర్ని మండలంలో వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
ఎంఎస్‌సీ ఫారం పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
తొలి విడత ఎన్నికల పోలింగ్ వివరాలు..
ఓటు హక్కు వినియోగించుకున్న 82.40 శాతం మహిళలు
పురుషుల ఓటింగ్ శాతం 80.21
మొత్తం పోలింగ్ 81.37 శాతం
పటిష్ట బందోబస్తు మధ్య ఓటింగ్.. కౌంటింగ్
పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా
ఎన్నికల అధికారి, కలెక్టర్
వినయ్‌కృష్ణారెడ్డి, ఉన్నతాధికారులు
బందోబస్తును పర్యవేక్షించిన సీపీ
సాయిచైతన్య
అధికార పార్టీదే ఆధిపత్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో మెదటి విడత పంచాయతీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నడిచినప్పటికీ అధికార కాంగ్రెస్ ఆధిపత్యం చూపించింది. ఏకగ్రీవాలతో కలిపి సింహభాగం గ్రామ పంచాయతీలను అధికార పార్టీ తన ఖాతాలో వేసుకుంది. 184 పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 137 చోట్ల విజయం సాధించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు చెరో 13 చోట్ల గెలుపొందారు. 21 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు.
ఓటెత్తిన గ్రామాలు
ఓటెత్తిన గ్రామాలు
ఓటెత్తిన గ్రామాలు
ఓటెత్తిన గ్రామాలు


