సర్పంచ్‌గా కొడుకు విజయం.. ఛాతి నొప్పితో తల్లి మృతి
రుద్రూర్: సర్పంచ్‌గా వి జయం సాధించిన కొ డుకు విజయోత్సవ సంబురాల్లో ఉండగా.. తల్లి ఛాతినొప్పితో మృతి చెందింది. ఈ వి షాదఘటన మండలంలోని రాణంపల్లిలో చోటు చేసుకుంది. సర్పంచ్‌గా విజయం సాధించిన కొండల్‌వాడి శంకర్ తన సోదరుడితో కలిసి గురువారం రాత్రి సంబురాలు జరుపుకుంటున్నారు. అదే సమయంలో ఇంటి నుంచి తల్లి లింగవ్వ తనకు ఛాతిలో నొప్పి వస్తోందని శంకర్ సోదరుడికి సమాచారం అందించింది. ఆయన వెంటనే ఇంటికి చేరుకుని లింగవ్వను బోధన్‌కు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూసింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.


