ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు
బోధన్: రబీ సీజన్ పంటల సాగుకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎడపల్లి మండలం జానకంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోదామును కలెక్టర్ గురువారం సందర్శించారు. ఎరువుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. స్టాక్ కొంత మిగిలి ఉండగానే ఇండెంట్ సమర్పించి ఎరువులు తెప్పించుకోవాలని సూచించారు. నిల్వల వివరాలను స్టాక్ బోర్డుపై తప్పని సరిగా ప్రదర్శించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రైతులకు ఎరువులు అందుబాటు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. యూరియా, ఇతర ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందొద్దని ఆయన అన్నారు.
సమస్యలను పరిష్కరించే సర్పంచ్ కావాలి..
సిరికొండ: ‘హామీలు కాదు.. మన గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించే సర్పంచ్ కావాలి’ అంటూ మండలంలోని తాళ్లరామడుగులో యువకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గ్రామంలోని సమస్యలను వివరిస్తూ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఓటును నోటుకు అమ్ముకోకుండా గ్రామాన్ని అభివృద్ది చేసే వారికే వేయాలని యువకులు సూచిస్తున్నారు.
నిజామాబాద్ డివిజన్‌లో ప్రత్యేక ఆంక్షలు
నిజామాబాద్ అర్బన్: రెండో విడత గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగే నిజామాబాద్ డివిజన్‌లో ప్రత్యేక ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయిచైతన్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 163 బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్‌ను అమలు చేస్తున్నామన్నారు. నిజామాబాద్ రూరల్, మాక్లూర్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో ఈనెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు


