తాతపై నెగ్గిన మనవడు
నవీపేట: మండలంలోని అబ్బాపూర్(బి) తండాలో వరుసకు తాత మనవళ్ల మధ్య జరిగిన పోరులో మనుమడు గెలుపొందాడు. సర్పంచ్ స్థానాన్ని జనరల్‌కు కేటాయించడంతో మాజీ ఎంపీటీసీ గంగామణి భర్త నెనావత్ శంకర్ నాయక్, ఆయన మనవడు నెనావత్ ప్రేమ్‌సింగ్ సర్పంచ్‌గా పోటీ చేశారు. మొత్తం 1,095 ఓట్లు పోల్ అవ్వగా ప్రేమ్‌సింగ్‌కు 467 ఓట్లు, శంకర్ నాయక్‌కు 442 ఓట్లు వచ్చాయి. 25 ఓట్ల తేడాతో తాతపై మనుమడు విజయం సాధించాడు.
నెనావత్ ప్రేమ్‌సింగ్ అబ్బాపూర్(బి)
తండా


