తెయూ సమాచారం..
పుస్తకావిష్కరణ
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ‘వికసిత భారత్–2047 డిజిటల్ యుగంలో వాణిజ్యాన్ని పునఃనిర్వచించడం’ అనే పుస్తకాన్ని గురువారం తెయూ వీసీ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి ఆవిష్కరించారు. తెయూ కామర్స్ డీన్ జి రాంబాబు, డాక్టర్ జి శ్రీనివాస్ ఈ పుస్తకానికి సంపాదకీయం వహించారు. 24 జూన్ 2025న తెయూ వాణిజ్య విభాగం నిర్వహించిన జాతీయ సదస్సు ‘వికసిత్ భారత్–2047 ద ట్రాన్స్‌ఫార్మాటివ్ రోల్ ఆఫ్ కామర్స్’ లో సమర్పించిన పరిశోధన పత్రాల ఆధారంగా పుస్తకంలో వ్యాసాలు సంకలనం చేశారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన వీసీ యాదగిరిరావు మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో వాణిజ్యరంగ అభివృద్ధిని అర్థం చేసుకోవడంలో ఈ గ్రంథం ఒక విలువైనదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఎం యాదగిరి మాట్లాడుతూ.. కామర్స్ విద్యార్థులు, పరిశోధకులకు ఈ పుస్తకం మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కామర్స్ అధ్యాపకులు కే గంగాధర్, ఎన్ శ్వేత తదితరులు పాల్గొన్నారు.
తెయూకు రూ.500 కోట్లు కేటాయించాలి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించాలని వర్సిటీ పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి కే గౌతంరాజ్ డిమాండ్ చేశారు. గురువారం తెయూ సెంట్రల్ లైబ్రరీ ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.వేయి కోట్లు కేటాయించడం హర్షనీయమన్నారు. అలాగే గ్రామీణ పేద విద్యార్థులు చదువుకునే తెయూ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించడంతో పాటు సీఎం యూనివర్సిటీని సందర్శించాలని కోరారు. ఇంటిగ్రేటెడ్, పీజీ విద్యార్థులకు నెలకు రూ.2వేలు చొప్పున ఫెలోషిప్స్ అందజేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు హనుమాండ్లు, సాయికుమార్, దేవేందర్, తిరుపతి, సాయి, రాజు, సంతోష్, సాయికిరణ్, రాకేశ్, సురేశ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
తెయూ(డిచ్‌పల్లి): కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 22, 23వ తేదీల్లో నిర్వహించే ఏబీవీపీ తెలంగా ణ రాష్ట్ర యూనివర్సిటీల విద్యార్థుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యవర్గ సభ్యుడు బీ శివ కోరారు. గురువారం తెయూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సమ్మేళన పోస్టర్లను వర్సిటీ వీసీ టీ యాదగిరిరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కా ర్యవర్గ సభ్యుడు మోహన్, వర్సిటీ ఉపాధ్యక్షులు మనోజ్,అశోక్, సంయుక్త కార్యదర్శి అనిల్, నాయకులు శివ, దుర్గాదాస్, నితిన్, అజేందర్, మణి, పావని,శృతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
శంకర్‌కు డాక్టరేట్ ప్రదానం
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పరిశోధక విద్యార్థి గుజ్జరి శంకర్ డాక్టరేట్ సాధించారు. తెయూ రిటైర్డ్ ప్రొఫెసర్ జి మనోజ పర్యవేక్షణలో ‘ఏ క్రిటికల్ స్టడీ ఆన్ మేజర్ థీమ్స్ అండ్ ఇష్యూస్ ఇన్ ద సెలక్టెడ్ నావెల్స్ ఆఫ్ చేతన్ భగత్’ అనే అంశంపై శంకర్ పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. గురువారం నిర్వహించిన మౌఖిక పరీక్షకు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ మేఘనా రావు ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు. అనంతరం శంకర్‌ను వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్‌కుమార్ తదితరులు అభినందించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ డీన్ లావణ్య, హెచ్‌వోడీ రమణాచారి, బీవోఎస్ చైర్మన్ సమత, అధ్యాపకులు స్వామిరావు, జ్యోత్స్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తెయూ సమాచారం..
తెయూ సమాచారం..


