మెరుపు తనిఖీలు
రైల్వే కమాన్ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు
ట్రాఫిక్ పోలీసులు జిల్లా కేంద్రంలో కొరడా ఝుళిపించారు. ఆదివారం సాయంత్రం కంఠేశ్వర్ బైపాస్, పులాంగ్‌చౌరస్తా, వినాయక్‌నగర్, వర్ని చౌరస్తా, అర్సపల్లి ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రైల్వే కమాన్ అండర్ బ్రిడ్జి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. సుమారు రెండున్నర గంటలపాటు తనిఖీలు కొనసాగగా.. 30 మంది వాహనదారు లు మద్యం సేవించి పట్టుబడ్డారు. రూ.10వేల చొప్పున జరిమానా విధించి వాహనాలను సీజ్ చేశారు. – నిజామాబాద్ అర్బన్/సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
మెరుపు తనిఖీలు


