రఘునాథ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని ర ఘునాథ ఆలయం(ఖిల్లా రామాలయం)లో పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. సీతారాము ల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయ అర్చకులు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మహిమాన్వితమైన ఆలయ అభివృద్ధికి తనవంతుసహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఈ పురాతన ఆలయం నిజామాబాద్ నగరానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు తదితరులు పాల్గొన్నారు.
గ్రామపాలన అధికారుల కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ అర్బన్: రెవెన్యూ అసోసియేష న్‌కు అనుబంధంగా గ్రామ పాలన అధికారు ల నూతన కార్యవర్గాన్ని జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం ఎన్నుకున్నా రు. అధ్యక్షుడిగా సాయినాథ్, ప్రధాన కార్య దర్శిగా సంతోష్, కోశాధికారిగా ప్ర శాంత్, ఉపాధ్యక్షులుగా సుధాకర్, నీరడి రమేశ్, గంగాధర్, మహిళా విభాగం అధ్యక్షు రాలిగా గంగాభవాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నేడు‘సాగర్’ నీటి విడుదల
నిజాంసాగర్: యాసంగి పంటల సాగు అవ సరాల కోసం సోమవారం ఉదయం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారు దల శాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకట నలో తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయనున్నందన ప్రధాన కాలువ వైపు రైతులు త మ పశువులను తీసుకెళ్లవద్దని వెల్లడించారు.
ప్రమోషన్స్‌లో
రిజర్వేషన్లు కల్పించాలి
నిజామాబాద్ నాగారం: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్‌లో రిజర్వేషన్ కల్పించాలని తె లంగాణ రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ జాక్ చైర్మన్ చంద్రశేఖర్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలో నిర్వహించిన బీసీ ఉ ద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ విద్యార్థులకు విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేష న్ కల్పించాలన్నారు. అగ్రవర్ణాల పది శా తం రిజర్వేషన్లను రద్దు చేసి, ఆ కోటాను బీ సీలకు వర్తింపజేయాలన్నారు. జాక్ కో ఆర్డి నేటర్ దేశబోయిన రమ మాట్లాడుతూ ప్రభు త్వ ఉద్యోగులకు 50 శాతం ఫిట్ మెంట్ ఇ చ్చి వేతన సవరణ చేయాలన్నారు. రాష్ట్ర బీ సీ ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంట్ రా సూరి జ్ఞానేశ్వర్, కార్యదర్శి మహేంద్ర సా గర్, గౌరవ సలహాదారులు బుస్సా ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు కరిపె రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టి నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, దయానంద్, బసవ సాయి తదితరులు పాల్గొన్నారు.
రఘునాథ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
రఘునాథ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
రఘునాథ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా


