సొంత నిర్ణయాలు తీసుకోవద్దు
● తప్పిదానికి ఆస్కారం ఉండొద్దు
● పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
బోధన్: పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ఈసీ నిబంధనలు యథాతథంగా అమలు చేయాలని, ప్రిసైడింగ్ ఆఫీసర్లు సొంత నిర్ణయాలు తీసుకోవద్ద ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పోలింగ్ శాతం, ఓట్ల లెక్కింపు వివరాల ప్రకటనలో తొందరపాటు ప్రదర్శించొద్దని, పక్కాగా నిర్ధారణ చేసుకున్న తర్వాతే వెల్లడించాలని సూచించారు. తొలి విడత పోలింగ్‌లో భాగంగా ఆదివారం సాలూర మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో మండలస్థాయి పోలింగ్ పీవోలకు శిక్షణ ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ పీవోలు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. టెండర్ ఓటుకు ఆస్కారం లేకుండా పక్కాగా పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల స్టేజ్–2 అధికారులు మినహా మరెవరి వద్ద సెల్‌ఫోన్లు ఉండకూడదన్నారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనివ్వాల న్నారు.
పక్కాగా ఏర్పాట్లు చేసుకోవాలి..
ఈ నెల 10న ఉదయం 8 గంటలకు ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రానికి చేరుకొని, సామగ్రి వెంట తీసుకెళ్లాలని పీవోలకు సూచించారు. చెక్‌లిస్ట్‌కు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని సరి చూసుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహణకు నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. స మావేశంలో డీఎల్‌పీవో నాగరాజు, ఎంపీడీవో శ్రీనివాస్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.


