ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్లాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రజలు పూర్తిగా కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారని, క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ కలుపుకుని నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మహేశ్‌గౌడ్‌తోపాటు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ సమక్షంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నగేశ్‌రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ బాధ్యతలు స్వీకరించా రు. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్‌తోపాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించాలన్నారు. జిల్లాకు పీసీసీ చీఫ్ పదవి మూడోసారి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కేసీఆర్ దీక్షను మధ్యలో విరమించారని, ఇప్పుడు దీక్షా దివస్ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారని పేర్కొన్నారు. జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృ ష్టి సారించారని, జిల్లా అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. జిల్లాకు ఇప్పటికే ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాలలతోపాటు టెంపుల్ కారిడార్ రోడ్లు తీసుకువచ్చామన్నారు. మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేపడతామని పేర్కొన్నారు.
అనంతరం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని స్థానిక సమస్యలు ఎన్నికల్లో విజయం సాధించే విధంగా ముందుకు సాగాలన్నారు. పదవులు పొందిన వారు పార్టీకి ఎల్లవేళలా అండగా ఉండాలన్నారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే చాలా గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే ఏకగ్రీవం అవుతున్నారని పేర్కొన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీకి రుణపడి ఉంటానని, తనకు పదవీబాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
బాధ్యతలు స్వీకరిస్తున్న డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, సీసీసీ అధ్యక్షుడు రామకృష్ణ
ప్రజలు కాంగ్రెస్‌కు అండగా ఉన్నారు
జిల్లాపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు
వేగంగా నిజామాబాద్ అభివృద్ధి
పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్
బాధ్యతలు స్వీకరించిన డీసీసీ, సీసీసీ అధ్యక్షులు నగేశ్‌రెడ్డి, రామకృష్ణ
ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్లాలి
ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్లాలి


