ప్రచార వ్యయం పరిమితం
● జనాభా సంఖ్య ఆధారంగా ఖర్చుపై
పరిమితులు
● 2018 పంచాయతీరాజ్ చట్టం
ప్రకారం వ్యయ పరిమితులు
మోర్తాడ్(బాల్కొండ): సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం కోసం పరిమితంగానే ఖర్చు చేయాల్సి ఉంది. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిర్ణయించిన మొత్తాన్నే ఎన్నికల సంఘానికి అభ్యర్థులు లెక్కలు చూపాల్సి ఉంది. మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డుస్థానాలకు పోటీ చేసే వారు ఎన్నికల సంఘం నిర్దేశించినదానికన్నా ఎక్కువ ఖర్చు చేస్తే వేటు వేసే అవకాశం ఉంది. 5 వేలకు మించి జనా భా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50లక్షల వరకు, వార్డు అభ్యర్థులు రూ.50వేల వరకు ఖర్చు చేయొచ్చు. అలాగే 5వేల కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అ భ్యర్థులు రూ.1.50లక్షలు, వార్డు స్థానాలకు పోటీ చేసేవారు రూ.30వేల వరకు మాత్రమే ఖర్చు చే యాలి. అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమ ర్పించే ముందే కొత్తగా బ్యాంకు ఖాతా తెరిచి ఆ ఖా తా ద్వారానే చెల్లింపులు చేసేలా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులకు పాత బ్యాంకు ఖాతాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి కొత్తగా ఎన్నికల్లో పోటీ చేయడానికే ఖాతాలను తెరవాల్సి ఉంది. ప్రతి ఖర్చుకు బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లింపులు చేయాలనే నిబంధన ఉండటంతో అభ్యర్థులు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచే పనిలో నిమగ్నమయ్యారు.


