ఇంటి నంబర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి..
ఆర్మూర్: మున్సిపల్ కమిషనర్‌గా అతిమల రాజు 2024 ఫిబ్రవరి 14వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మున్సిపల్ పాలకవర్గం లేకపోవడంతో అన్నీతానై వ్యవహారాలను చక్కబెడుతూ వచ్చారు. ఆయనకన్నా ముందు పని చేసిన కమిషనర్ కేటాయించిన 140 ఇళ్ల నంబర్లను అక్రమంటూ రాజు రద్దు చే శా రు. ఇక్కడి నుంచే రాజు అన అక్రమవసూళ్లకు దా రులు వేసుకున్నారు. నిజాయితీగా ఉద్యోగం చేస్తు న్నానని చెప్పుకొనే ఆయన తన కారుకు నెంబర్ ప్లేట్ లేకుండా నడిపారు. ఇక ప్రభుత్వం కేటాయించిన సెల్‌ఫోన్‌ను ఏ రోజూ లిఫ్ట్ చేసి ప్రజల సమస్య లను తెలుసుకోలేదు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు మూ డు నెలలుగా నిఘా సారించినట్లు ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్‌గౌడ్ పేర్కొన్నారు.
ఏడు నెలల్లో ఐదుగురు..
ఆర్మూర్ పట్టణంలో కేవలం ఏడు నెలల కాలంలోనే ముగ్గురు అధికారులు, ఇద్దరు ప్రైవేటు డ్రైవర్లు ఏసీబీకి చిక్కడం అధికారుల అవినీతి తీరుకు అద్దం పడుతోంది. ఏప్రిల్‌లో పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్, ఆగస్టులో ఎంవీఐ ఏసీబీకి చిక్కారు. తాజాగా కమిషనర్‌తోపాటు ఆయన ప్రైవేట్ డ్రైవర్ ఏసీబీకి పట్టుబడ్డారు.


