● ప్రారంభమైన తొలివిడత నామినేషన్‌ల ప్రక్రియ
● సర్పంచ్ స్థానాలకు 144.. వార్డు స్థానాలకు 96 మంది నామినేషన్‌లు
బోధన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్‌కు గురువారం నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. బోధన్ రెవెన్యూ డివిజన్‌లోని పది మండలాలు, నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నవీపేట మండలంలోని 184 సర్పంచ్, 1642 వార్డు స్థానాలకు నామినేషన్‌లను స్వీకరించారు. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 144, వార్డు స్థానాలకు 96 మంది నామినేషన్‌లు దాఖలు చేశారు. తొలి విడత ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 57 కేంద్రాలను ఏర్పాటుచేసిన అధికారులు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్‌లను స్వీకరించారు. కేంద్రాల వద్ద పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో హెల్ప్‌డెస్క్‌లు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.


