నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు
● ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వనోళ్లు..
బీసీలకు పదవులు ఇస్తారా?
● మీడియాతో చిట్‌చాట్‌లో
ఎంపీ అర్వింద్ ధర్మపురి
సుభాష్‌నగర్: కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి మొదట గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నా రు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో గురువా రం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. గత పదేళ్లుగా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వాలు నయా పైసా కేటాయించడం లేదన్నారు. అందుకే కాంగ్రెస్ గుర్తులు లేని ఎన్నికలకు వెళ్తోందని పేర్కొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. మహిళలకు వడ్డీ మాఫీ, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ, ఇందిరమ్మ చీరలు తదితర స్కీములు కేవలం ఎన్నికల కోసమేనని, ప్రజలు ఎక్కడ తిరస్కరిస్తారోనని హడావుడి చేశారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వని వారు.. ఆ వర్గాలకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావడానికి 42శాతం రిజర్వేషన్లు ఇస్తారా అని ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు
జిల్లాలో ఆర్‌వోబీ పనులకు సంబంధించి పెండింగ్ బకాయిలు రూ.13.50 కోట్లకుపైగా నిధులు కోరిన వెంటనే విడుదల చేసినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అ ర్వింద్ అన్నారు. పది రోజుల్లో అడవి మామిడిపల్లి పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించానని, మాధవనగర్ ఆర్‌వోబీ పనులు వేగవంతమయ్యాయన్నారు. అర్సపల్లి ఆర్‌వోబీ పనుల కో సం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ త్వరగా చేపట్టా ల ని సూచించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచా రి, జగిత్యాల్ జిల్లా అధ్యక్షుడు గిరిబాబు, నాయకు లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ప్రమోద్‌కుమార్, మాస్టర్ శంకర్, ప్రదీప్‌రెడ్డి పాల్గొన్నారు.
పదవి వచ్చినా పట్టించుకోరా ?
మంత్రి పదవి రాక సుదర్శన్‌రెడ్డి అలిగారని, పదవి వచ్చిన తర్వాత కూడా అభివృద్ధిని పట్టించుకోకపోతే ఎలా అని అర్వింద్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న బోధన్ నియోజకవర్గంలోని ఆర్‌వోబీ, ఆర్‌యూబీ ప నులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. సుదర్శన్‌రెడ్డికి సాధ్యం కాని గ్యారెంటీల అమలు సలహాదారు పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు.


