జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Nov 7 2025 7:41 AM | Updated on Nov 7 2025 7:41 AM

జాతీయ

జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

జక్రాన్‌పల్లి: మండలంలోని కలిగోట్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రణతి జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం పురుషోత్తమాచారి, పీఈటీ యాదగిరి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బరేలిలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ప్రణతి పాల్గొననున్నట్లు వారు తెలిపారు.

కబడ్డీ పోటీలకు..

జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్‌ గ్రామానికి చెందిన విద్యార్థిని గోత్రాల పద్మావతి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 5న కామారెడ్డిలో జరిగిన ఉమ్మడి జిల్లా అండర్‌ –17 ఎస్‌జీఎఫ్‌ కబడ్డీ పోటీల్లో పద్మావతి ప్రతిభ చాటడంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పీడీ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ నెల 8 నుంచి 10 వరకు కొత్తగూడెంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పద్మావతి పాల్గొననున్నట్లు పీడీ తెలిపారు. పద్మావతిని హెచ్‌ఎం సురేందర్‌రెడ్డి, ఉపాధ్యాయ బృందం, వీడీసీ సభ్యులు రాజేశ్వగౌడ్‌, తిరుపతిరెడ్డి, నాగేశ్‌, పవన్‌, గోపి, ప్రనీత్‌ అభినందించారు.

ఖోఖో పోటీలకు పిప్రి విద్యార్థిని..

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆర్మూర్‌ మండలం పిప్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఏ వైష్ణవి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం నవీన్‌ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో వైష్ణవి పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. వైష్ణవిని హెచ్‌ఎం నవీన్‌తోపాటు, ఉపాధ్యాయులు అభినందించారు.

రగ్బీ పోటీలకు సిరికొండ విద్యార్థులు..

సిరికొండ: రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు సిరికొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన మణిచరణ్‌, స్పందన, లహరి, దీపిక, ప్రణవి ఎంపికై నట్లు పీజీ హెచ్‌ఎం సతీశ్‌ కుమార్‌, పీడీ అబ్బయ్య తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లో ఈ నెల 22 నుంచి జరిగే స్టేట్‌ మీట్‌లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.

హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎన్‌జీఎస్‌ విద్యార్థులు

నిజామాబాద్‌ నాగారం: రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు నవ్యభారతి గ్లోబల్‌ స్కూల్‌ విద్యార్థులు అమన్‌ ఖురేషి, మనిత్‌, గౌతమ్‌, సుశాంత్‌, మహిత, వినీష, నాగవైష్ణవి, సహస్ర, శ్రీనిధి ఎంపికై నట్లు చైర్మన్‌ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్రస్థాయిలో సైతం రాణించి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులతోపాటు వ్యాయామ ఉపాధ్యాయుడు అజ్మత్‌ఖాన్‌ను అభినందించారు. పాఠశాల ప్రిన్సిపల్‌ ఆంథోనీ, హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ లత, వైస్‌ ప్రిన్సిపల్‌ సరిత సుధీర్‌ పాల్గొన్నారు.

జాతీయ స్థాయికి

ఎంపికై న ప్రణతి

కబడ్డీ పోటీలకు

ఎంపికై న పద్మావతి

జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక 1
1/4

జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక 2
2/4

జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక 3
3/4

జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక 4
4/4

జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement