కార్తీక కాంతిలో నీలకంఠుని సన్నిధి
కార్తీక దీపాల వెలుగులో నీలకంఠేశ్వరాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను
సంతరించుకుంది. పవిత్ర కార్తీకమాసంలో రెండో సోమవారాన్ని పురస్కరించుకుని
మహిళలు పెద్ద సంఖ్యలో నగరంలోని నీలకంఠేశ్వరాలయానికి తరలివచ్చారు. ఆలయ, కోనేరు ప్రాంగణాల్లో దీపాలను వెలిగించారు. అర్చకులు పుష్కరిణికి హారతి ఇచ్చారు. అలాగే చిరంజీవాచార్యుల హరికథను శ్రద్ధగా విన్నారు.
అనంతరం స్వామివారికి ప్రత్యేక పల్లకీ సేవ నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి
శ్రీరాం రవీందర్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
– నిజామాబాద్ రూరల్
							కార్తీక కాంతిలో నీలకంఠుని సన్నిధి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
