గర్భిణులకు అన్ని రకాల సేవలందించాలి
గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు
నిజామాబాద్ నాగారం: తమకు కేటాయించిన కేంద్రాల్లో మార్పు సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు అన్ని రకాల సేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ అధికారిణి బి రాజ్యశ్రీ ఆదేశించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య సంక్షేమ కార్యక్రమాలపై సోమవారం తన కార్యాలయంలో డీఎంహెచ్‌వో సమీక్ష నిర్వహించారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలని, డ్రాప్ అవుట్‌లను గుర్తించాలని అన్నారు. డెంగీ ప్రబలకుండా చేపడుతున్న చర్యలు, టీబీ ముక్త్‌భారత్ తదితర అంశాలపై చర్చించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ల నూతన భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలను కేటాయించేలా గ్రామాభివృద్ధి కమిటీలు లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని ఆదేశించారు. అలాగే నిర్మాణం పూర్తయిన పల్లె దవాఖానలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వోలు రమేశ్, డాక్టర్లు సమత, అశ్విని, ప్రోగ్రాం అధికారులు తుకారాం రాథోడ్, వైద్యులు రాజు, అశోక్, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీలపై సమీక్ష
ప్రైవేట్ ఆస్పత్రులు తనిఖీ చేసే బృందాల విధులపై డీఎంహెచ్‌వో రాజశ్రీ సమీక్షించారు. తనిఖీలకు వెళ్లినప్పుడు నమోదు చేసే అంశాలు, రిజిస్టర్ల నిర్వహణపై సూచనలు చేశారు. డాక్టర్ శిఖర, వైద్యాధికారులు, డీహెచ్‌ఈ వేణుగోపాల్, సురేశ్ పాల్గొన్నారు.
గర్భిణులకు అన్ని రకాల సేవలందించాలి


