ఒకే షిఫ్ట్‌లో పనిచేయించండి
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఒకే షిఫ్ట్‌లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు గతవారం వరకు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకే షిఫ్ట్‌లో పని చేయించేవారని అన్నారు. ఇటీవల ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్‌ల్లో పనిచేయించాలని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
