యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు
● సీపీ సాయిచైతన్య
● ముగిసిన వాలీబాల్, కబడ్డీ టోర్నీ
ఆర్మూర్‌టౌన్: యువత, విద్యార్థులు డ్రగ్స్, సైబర్ క్రైమ్‌కు దూరంగా ఉంటేనే జీవితం ప్రశాంతంగా ఉంటుందని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాల క్రీడా మైదానంలో డ్రగ్స్ వద్దు.. క్రీడలు ముద్దు అనే నినాదంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు కొనసాగిన వాలీబాల్, కబడ్డీ టోర్నీ సోమవారం ముగిసింది. కార్యక్రమానికి హాజరైన సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ డ్రగ్స్‌తో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. శత్రుదేశాలు మన దేశాన్ని బలహీనపర్చడానికి డ్రగ్స్, స్మగ్లింగ్, సైబర్ క్రైమ్ మార్గాన్ని ఎంచుకుంటున్నాయని, వీటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. మన దేశం బలంగా ఉండాలంటే చెడు అలవాట్లకు లొంగకూడదన్నారు.యువత గంజాయి, డ్రగ్స్ జో లికి వెళ్లొద్దని సీపీ పిలుపునిచ్చారు.అనంతరం విజే త జట్లకు సీపీ సాయిచైతన్య బహుమతులు ప్రదా నం చేశారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్, ఎస్సై రమేశ్, ఎంఈవో రాజాగంగారాం, క్రీడల కన్వీనర్ లక్ష్మీనర్సయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
