పసుపు పరిశ్రమ సందర్శన
జక్రాన్‌పల్లి: మండలంలోని మనోహరాబాద్ గ్రా మంలో ఉన్న జేయం కేపీఎం పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘాన్ని యూనియ న్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జయకృష్ణ, మేనేజర్ వైభవ్, స్థానిక యూనియన్ బ్యాంక్ మేనేజర్ సుమలత సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో ఉత్పత్తులను పరిశీలించారు. ఐదు గ్రామా ల రైతులు కలిసి ఎంఎస్‌ఎంఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో సొసైటీగా ఏర్పాటు చేసుకొని కంపెనీ యా క్ట్‌లో రిజిస్టర్ అయ్యి మారుమూల ప్రాంతంలో పరి శ్రమను స్థాపించడం గొప్ప విషయమని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో పసు పు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డి, డైరెక్టర్ అల్లూరి సంతోష్ రెడ్డి, రైతు బుచ్చిరెడ్డి, సూపర్‌వైజర్ రొడ్డ రుత్విక్ పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
