నింబాచల గోవిందా
స్వామి వారి సుదర్శన చక్రం
పల్లకీ సేవలో ఆలయ పండితులు, భక్తులు
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): నింబాచల గోవిందా.. మోక్ష ప్రదాత గోవిందా.. అంటూ భక్తజనం లింబాద్రిగుట్టపై పులకించింది. భీమ్‌గల్ లింబాద్రి గుట్టపై స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగు తున్నాయి. సోమవారం గిరిప్రదక్షిణ నిర్వహించగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గోవింద నా మస్మరణ చేస్తూ గిరి చుట్టూ ప్రదక్షిణ చేశారు. పల్లకీలో స్వామివారి సుదర్శన చక్రాన్ని ఉంచి గిరిప్రదక్షిణ నిర్వహించారు. తెల్లవారుజామునే పారణ త్ర యోదశి, వైకుంఠ చతుర్ధశి, ప్రభోదోత్సవం కార్యక్రమాలు నిర్వహించి, తులసి – విష్ణుమూర్తి వివా హోత్సవం (తులసి వివాహం) కన్నుల పండువగా నిర్వహించారు. భీమ్‌గల్ సీఐ పొన్నం సత్యానారాయణగౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఎస్పై సందీప్‌తోపాటు సిబ్బంది విధులు నిర్వర్తించారు.
నింబాచల గోవిందా


