అయ్యో.. అన్నదాత
● రంగు మారి మొలకలు వస్తున్న ధాన్యం
● లబోదిబోమంటున్న రైతులు
రెంజల్/ డిచ్‌పల్లి: అకాల వర్షాలు, తుపాను ప్రభావం రైతులను అతలాకుతలం చేసింది. రెండు రోజులుగా తుపాను ప్రభావంతో పట్టాల కింద కప్పి ఉంచిన ధాన్యాన్ని శుక్రవారం ఆరబోసేందుకు కుప్పలను తెరువగా కింది భాగంలో ధాన్యానికి మొలకలు వచ్చాయి. రైతులు అప్పటికప్పుడు కూలీలను ఏర్పాటు చేసుకుని మొలకలను ధాన్యం నిల్వల నుంచి వేరు చేయించారు. మరి కొందరు రైతులకు చెందిన ధాన్యం రంగు మారింది. ఓ పక్క దిగుబడులు సగానికి పైగా తగ్గిపోగా..మరో పక్క అకాల వర్షాలతో తడిసి ముద్దయిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అదనంగా కూలీలను ఏర్పాటు చేసుకుని నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయ్యో.. అన్నదాత
అయ్యో.. అన్నదాత
అయ్యో.. అన్నదాత
అయ్యో.. అన్నదాత


