
వాలీబాల్ టోర్నమెంట్‌లో రన్నర్‌గా నిజామాబాద్
నిజామాబాద్‌నాగారం: రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ వాలీబాల్ టోర్నమెంట్‌లో జిల్లా బాలికల జట్టు రన్నర్‌గా నిలిచి ట్రోఫి కై వసం చేసుకున్నారు. మహబుబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన 69వ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి బాలికల వాలీబాల్ టోర్నమెంట్‌లో ఇటీవల జరిగిన సెమీఫైనల్‌లో నిజామాబాద్ బాలికల జ ట్టు ఖమ్మం జిల్లా జట్టుపై 2–0 తో గెలుపొంది ఫైనల్‌లో ప్రవేశించింది. అనంతరం ఫైనల్స్‌లో మహబూబ్‌నగర్‌తో తలపడి ఓటమి చెంది, రన్నర్‌గా నిలిచింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి, విశిష్ట అతిథిగా విచ్చేసిన స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఈసందర్బంగా జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగమణి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోచ్, మేనేజర్ బాలయ్యకు, శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు.