
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం..
కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబీకు లకు ప్రభుత్వం, పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని, ధైర్యంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి భరోసా కల్పించా రు. నగరంలో పాత నేరస్తుడిని అరెస్టు చేసే క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకు గు రయ్యాడు. ప్రమోద్ కుటుంబీకులను డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం మల్టీ జోన్ ఐజీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తదితరులతో కలిసి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు తాను వచ్చానని వారికి వెల్లడించారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్యకు గురైన ఘటన దురదృష్టకరమని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపర్చా రు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి ఎక్స్‌గ్రేషియాతో పాటు 300 గజాల ఇంటి స్థలం, పెన్షన్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించిందని డీజీపీ గుర్తు చేశారు.