
అమరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
నిజామాబాద్ అర్బన్ : తొమ్మిది మంది పోలీసు అమర వీరుల కుటుంబాలకు డీజీపీ శివధర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూ పతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలతో కలిసి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని కమిషనరేట్ కార్యాలయంలో మంగళ వారం నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ జిల్లాలో 1989 నుంచి ఇప్పటివరకు 18 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. వారిలో తొమ్మిది కుటుంబాలకు ఇందల్వాయి మండలం గన్నారం శివారులో 300 గజాల చొప్పున ఇంటి స్థలాలు అందించనున్న ట్లు డీజీపీ తెలిపారు. మిగతా తొమ్మిది కుటుంబాలు కూడా ముందుకు వస్తే, వారికి సైతం అదే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు. ఈ మేరకు సంసిద్ధత తెలిపిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి పోలీసు శాఖ తరపున డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు.
అనేక కేసుల్లో నిందితుడైన కరుడుగట్టిన నేరస్తు డు రియాజ్‌ను పట్టుకునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన సారంగాపూర్ యువకుడు స య్యద్ ఆసిఫ్‌కు పోలీసు శాఖలో హోంగార్డు ఉ ద్యోగం కల్పించాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రతిపాదించారు. దీనిపై డీజీపీ శివధర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రాష్ట్ర పోలీ సు శాఖలో హోంగార్డు పోస్టుల భర్తీ కోసం ప్ర భుత్వం నోటిఫికేషన్ వెలువరించనుందని, స య్యద్ ఆసిఫ్‌కు హోంగార్డు ఉద్యోగం కల్పించే లా కృషి చేస్తామన్నారు.
తొమ్మిది కుటుంబాలకు పంపిణీ చేసిన డీజీపీ శివధర్ రెడ్డి
పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే
భూపతి రెడ్డి, కలెక్టర్, ఐజీ, సీపీ