వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి

Oct 22 2025 6:53 AM | Updated on Oct 22 2025 6:53 AM

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): మండలంలోని కంజర్‌ గ్రామానికి చెందిన దొంతుల అరుణ్‌కుమార్‌ (రాజు) (41) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు, నాలుగో టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలో అరుణ్‌కుమార్‌ కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీపావళి పండుగ కావడంతో సోమవారం ఉదయం బైక్‌పై సామగ్రి కోసం నిజామాబాద్‌కు బయలుదేరాడు. నగరంలోని హనుమాన్‌ జంక్షన్‌ వద్ద అతడు మూల మలుగుతుండగా, అదేసమయంలో మాధవనగర్‌ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

నిర్లక్ష్యపు డ్రైవింగే కారణం!

మాధవనగర్‌కు చెందిన యువకుడితోపాటు మరో ముగ్గురు నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు, స్థానికులు పేర్కొంటున్నారు. కారులో ఉన్న నలుగురు పరారయ్యారు. మంగళవారం సాయంత్రానికి కూడా వారి ఆచూకీ లభించలేదని తెలిసింది. కాగా యువకుడు మృతికి కారణమైన వారిని కాపాడేందుకు పోలీస్‌స్టేషన్‌లోని ఓ కానిస్టేబుల్‌ ప్రయత్నిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని పూలు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన అరుణ్‌ మృతిచెందడంతో కుటుంబ పెద్దను కోల్పోయి కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి అనారోగ్యంతో ఉన్న తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మేడ్చల్‌లో మాచారెడ్డి మండల వాసి..

మాచారెడ్డి: మేడ్చల్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాచారెడ్డి మండలం నెమ్లిగుట్ట తండాకు చెందిన భానోత్‌ శ్రీనివాస్‌ (33) మృతిచెందాడు. వివరాలు ఇలా.. శ్రీనివాస్‌ మేడ్చల్‌ ప్రాంతంలోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. దీపావళి కోసం ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌ మంగళవారం బైక్‌పై తిరిగి మేడ్చల్‌ బయలుదేరాడు. మేడ్చల్‌ సమీపంలో అతడిని మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలు కాావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చెరువులో పడి మహిళ..

ఎల్లారెడ్డి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని సాతెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేష్‌ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని సాతెల్లి గ్రామానికి చెందిన పసుపుల పద్మ (43) ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. గ్రామశివారులోని చెరువులో మరుసటి రోజు ఆమె మృతహం తేలడంతో స్థానికులు గుర్తించి, పోలీసులకు సమచారాం అందించారు. పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాలకృత్యాల కోసం వెళ్లిన పద్మ చెరువులో జారి పడి ఈతరాక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ పరామర్శించారు.

ఫిట్స్‌తో చిన్నారి..

మోపాల్‌: మండలకేంద్రంలో ఐదు నెలల చిన్నారి ఫిట్స్‌తో మృతిచెందినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. వివరాలు ఇలా.. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌ మండలం, కూర్మల్‌ గూడ గ్రామం ఇంద్రానగర్‌ కాలనీకి చెందిన జంగం లక్ష్మీ–శ్రీరాములు దంపతులకు ఐదు నెలల చిన్నారి(సంధ్య) ఉంది. దంపతుల మధ్య గొడవల కారణంగా లక్ష్మీ చిన్నారితోపాటు రెండు నెలల క్రితమే మోపాల్‌లోని తన అన్న ఇంటికి వచ్చింది. చిన్నారి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈక్రమంలో మంగళవారం ఫిట్స్‌ రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో జరిగిన వివిధ ఘటనల్లో పలువురు మృతిచెందారు. వారిలో రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత చెందగా, చెరువులో పడి ఓ మహిళ, ఫిట్స్‌తో ఓ చిన్నారి ప్రాణాలు విడిచారు. అలాగే సౌతాఫ్రికాలో భిక్కనూరుకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement