
పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు వెలకట్టలేవని డిచ్‌పల్లిలోని ఏడో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సీహెచ్ సాంబశివరావు అన్నారు. బెటాలియన్‌లో మంగళవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా బెటాలియన్‌లోని అమరవీరుల స్థూపం వద్ద అడిషనల్ కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్లతోపాటు అమరవీరుల కుటుంబాల సభ్యులు, బెటాలియన్ సిబ్బంది పుష్పగుచ్ఛాలను ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అడిషనల్ కమాండెంట్ మాట్లాడుతూ.. విధినిర్వహణలో ఇప్పటివరకు ఏడో బెటాలియన్‌కు చెందిన 14 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. అమరులైన పోలీసులకు రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులర్పించారు. అసిస్టెంట్ కమాండెంట్లు కేపీశరత్ కుమార్, కేపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
విధులను పకడ్బందీగా నిర్వహించాలి
నిజామాబాద్ నాగారం: క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది విధులను పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. జిల్లాకేంద్రంలో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని కీటక జనత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో మా ట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు గృహ సందర్శన చేస్తూ జ్వరాల సర్వేను, లార్వా బ్రీడింగ్ సోర్సెస్‌ను, నీటి నిల్వలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నా రు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. నోడల్ అధికారులు, సభ్యులు ప్రణాళిక ప్రకారం పర్యవేక్షించాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు సకాలంలో పీ హెచ్‌సీలకు చేరుకోవాలన్నారు. శాంపిల్స్ తీసుకోవడంపై జాగ్రత్తలను సూచించారు. జిల్లా కీ టక జనిత కార్యక్రమ అధికారి తుకారాం రా థోడ్, ఏఎంవో సలీం, తదితరులు ఉన్నారు.
నిజామాబాద్‌నాగారం: నగరంలోని ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాల మైదానంలో ఈనెల 23న నిజామాబాద్ జిల్లా సైకిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఎంపికపోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ కాంత్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 14, 16, 18, మెన్, ఉమెన్ వివిధ కేటగిరిలలో పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 9 గంటలకు సొంత సైకిల్‌తో బోనాఫైడ్, ఆధార్ కార్డుతో రిపోర్ట్ చేయాలని అన్నారు. మరిన్ని వివరాలకు 98482 30207ను సంప్రదించాలని తెలిపారు.
దళారులను ఆశ్రయించొద్దు
కామారెడ్డి క్రైం: డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాల కోసం దళారులను ఆశ్రయించొద్దని రవాణా శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మంగగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడా రు. ఏ అవసరం ఉన్నా మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసు కుని నేరుగా కార్యాలయానికి వచ్చి అధికారులను సంప్రదించాలన్నారు. రవాణా శాఖ కా ర్యాలయంలో పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అపోహలకు తా వు లేదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘సారథి’ అనే వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటోందని, అదొక్కటి మాత్ర మే వాహనదారులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. సమస్యను ఇదివరకే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని, ప్రతి రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గగంటల వరకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి