
ధాన్యం సేకరణలో జాప్యం చేయవద్దు
బోధన్: ధాన్యం సేకరణ ప్రక్రియలో జాప్యానికి చో టు ఇవ్వకుండా, ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.కొనుగోళ్లు సాఫీగా కొనసాగేందుకు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటూ పకడ్భందీగా పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. సాలూర మండలంలోని సాలంపాడ్ క్యాంప్, బోధన్ మండలంలో ని పెగడాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.అనంతరం ఆయన రైతులతో మాట్లాడు తూ ఏమైనా ఇబ్బందులున్నాయా? అని ఆరా తీశా రు. కౌలు రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతుల వివరాలు నమోదు చేసుకుని ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని వెనువెంటనే తూకం వేయాలనిఆదేశించారు. రైస్‌మిల్లుల వద్ద ధాన్యం వేగంగా దిగుమతి అయ్యేలా చూడాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్‌డీవో సాయాగౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, తహసీల్దార్ విఠల్, శశిభూషణ్ ,ఏవో సంతోష్, సొసైటీ చైర్మన్ గుణపాటి బ్రహ్మా రెడ్డి తదితరులు ఉన్నారు.
అధికారులు అందుబాటులో
ఉండి పర్యవేక్షించాలి
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
సాలంపాడ్ క్యాంప్, పెగడాపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన